గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్ళీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు. హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.820 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,500 కి చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.920 పెరుగుదలతో రూ.51,050కు చేరింది. అలాగే వెండి ధర కూడా భారీగా పెరిగిపోయింది.
కేజీ వెండి ధర రూ.2000 పెరిగిపోయింది. దీంతో ధర రూ.67,000కి చేరింది. ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నేడు మార్కెట్‌లో రూ.1400 మేర ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,900 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.900 పెరగడంతో రూ.51,150కి చేరింది. కేజీ వెండి ధర రూ.2000 పెరుగుదలతో రూ.67,000 కు చేరింది.