BREAKING : తెలంగాణలో కొత్త‌గా 12 ఒమిక్రాన్ కేసులు న‌మోదు..20 కి చేరిన సంఖ్య‌

-

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 12 ఒమి క్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 20కు చేరింది. విదేశాల నుంచి వచ్చిన పది మందికి.. ఒమి క్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని తెలంగాణ వైద్య శాఖ పేర్కొంది.

రిస్కు దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రా నికి వచ్చిన ఇద్దరికీ ఈ కొత్త వేరియంట్ సోకింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 20కు చేరింది.

అటు మ‌హరాష్ట్ర లో ఇవాళ 8 ఒమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే.. క‌ర్ణాట‌క రాష్ట్రం లో ఇవాళ ఒక్క రోజే 6 ఒమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా… 137 కు చేరాయి ఒమిక్రాన్ కేసుల సంఖ్య‌. కా గా… తెలంగాణ రాష్ట్రం లో ఇవాళ 185 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. ఒక‌రు మ‌ర‌ణించారు.

Read more RELATED
Recommended to you

Latest news