ఏపిలో 13 మంది ఐపిఎస్ అధికారులు బదిలీ

-

అమరావతి : ఏపిలో 13 మంది ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ జగన్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రి అర్బన్ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి బదిలీ కాగా… జిఏడి లో విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ ఎస్పీ గా శ్రీముషి బదిలీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్ దేవ్ శర్మ బదిలీ కాగా..డిజిపి ఆఫీస్‌ మంగళగిరిలో రిపోర్టు చేయాల్సిందిగా నారాయణ నాయక్ కు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. కోయ ప్రవీణ్ అక్టోపస్ ఎస్పీగా బదిలీ కాగా, రవాణా సంస్ధకు పూర్తి అధనపు భాద్యతలు సైతం అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

విక్రాంత్ పాటిల్ ను విజయనగరం ఏపిఎస్పీ 5 వబెటాలియన్ కమాండెంట్ గా బదిలీగా కాగా.. ఆర్ ఎన్ అమ్మిరెడ్డిని మంగళగిరి డిజిపి ఆఫీసులో ఏఐజి లా అండ్ ఆర్డర్ కు బదిలీ అయ్యారు. మల్లికా గార్గ్ ను ప్రకాశం జిల్లా ఎస్పీగా బదిలీకాగా.. రాహూల్ దేవ్ సింగ్ ను విజయవాడ రైల్వే ఎస్పీగా బదిలీ అయ్యారు.

అలాగే.. అజితా వేజెండ్ల ను మంగళగిరి, 6వ బెటాలియన్ కమాండెంట్ గా బదిలీ చేయగా… సుమిత్ సునీల్ ను కాకినాడ ఏపిఎస్పీ, మూడవ బెటాలియన్ కమాండెంట్ గా బదిలీ చేసింది సర్కార్‌. గౌతమి సాలి విశాఖ నగరం డిసిపి 1గా బదిలీ కాగా… వకుల్ జిందాల్ ను సీఎంఎస్ జి ఇంటిలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు జీవో నెంబరు 1181 ను విడుదల చేసారు సిఎస్ ఆదిత్య నాధ్ దాస్.

 

Read more RELATED
Recommended to you

Latest news