ఎస్బీఐలో 1422 ఖాళీలు.. వయస్సు, అర్హత, అప్లై చేసుకునే విధానం మొదలైన వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 1422 సర్కిల్‌ బేస్‌డ్‌ ఆఫీసర్ పోస్టులు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలను చూస్తే.. 1422 సర్కిల్‌ బేస్‌డ్‌ ఆఫీసర్ పోస్టులు ఉండగా తెలుగు రాష్ట్రాల్లో 175 పోస్టులు వున్నాయి.

సర్కిల్‌ బేస్‌డ్‌ ఆఫీసర్ పోస్టుకి అర్హత:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేసుండాలి.
లేదంటే తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత అయ్యి ఉండాలి.
సెప్టెంబర్‌ 30, 2022వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్ళు ఉండాలి.

సర్కిల్‌ బేస్‌డ్‌ ఆఫీసర్ పోస్టుకి అప్లై చేసే విధానం:

నవంబర్‌ 7, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్‌ ఫీజు వివరాలు:

అభ్యర్ధులు రూ.750లు అప్లికేషన్‌ ఫీజు కింద పే చెయ్యాల్సి వుంది.
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వుంది.

ఎంపిక ఎలా చేస్తారు..?

ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అధికారిక వెబ్ సైట్ లో పూర్తి వివరాలను చూసి అప్లై చేసుకోవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news