వరదల వలన ఏపీకి 15 వేల కోట్ల నష్టం !

-

వచ్చే నెల రెండో వారంలో ఏపీకి కేంద్ర బృందం రానుంది. నవంబర్ 9,10వ తేదీల్లో వరద నష్టం అంచనాపై రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించే అవకాశం ఉందని అంటున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ కేంద్ర బృందం పర్యటించనుంది. వరదలు,వర్షాల వల్ల జరిగిన పంట, ఆస్తి నష్టం అంచనాలను ప్రభుత్వం సిద్దం చేస్తోంది. ఒకట్రొండు రోజుల్లో నష్టంపై తుది అంచనాలను ప్రభుత్వానికి సమర్పించనున్నారు అధికారులు.

వరదల వల్ల 12 శాఖలకు సంబంధించి భారీగా నష్టం వాటిల్లిందని అంచనాకు వచ్చారు అధికారులు. సుమారు రూ. 10 వేల కోట్ల మేర పంట, ఆస్తి నష్టం జరిగిందంటోన్న అధికారులు, రోడ్లు, వ్యవసాయం, ఆక్వా, ఉద్యాన పంటలు, విద్యుత్, ఇరిగేషన్, మున్సిపల్ వంటి శాఖలకు భారీగా నష్టం వచ్చిందని అంటున్నారు. అలానే ఆర్ అండ్ బీకి సుమారు రూ. 5 వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు సమాచారం. ప్రభుత్వం రూపొందిన వరద నష్టం నివేదికను కేంద్ర బృందానికి అందచేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. తక్షణ సాయం కింద కనీసం రూ. 1000 కోట్లు కేంద్రాన్ని అడగాలని భావిస్తున్నారు అధికారులు. రోడ్ల మరమ్మత్తులు రైతుల ఇన్ పుట్ సబ్సిడీ నిమిత్తం అత్యవసరంగా రూ. 1000 కోట్లు అవసరమని అధికారుల అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news