జూబ్లీహిల్స్:పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన హైక్లాస్ లేడీస్…!

-

జూబ్లీహిల్స్ లో పేకటస్థావరం పై పోలీసులు మెరుపు దాడి చేశారు.జూబ్లీహిల్స్‌ వెంకటగిరిలోని ఓ ఇంట్లో పలువురు ప్రముఖులు పేకాట ఆడుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అ ఇంటిపై దాడి చేసి వివిధ రంగాలకు చెందిన 11 మంది వ్యాపార ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు.

వీరంతా సంపన్న కుటుంబాలకు చెందిన డాక్టర్లు, న్యాయవాదులుగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీరి నుంచి సెల్‌ఫోన్లతోపాటు 3 లక్షల 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌ వెంకటగిరిలో ఓ ఇంట్లో గుట్టుగా ఈ వ్యవహరం ఎప్పటి నుంచో నడుస్తున్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news