పదహారేళ్ళ విద్యార్థి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (IIIT శ్రీకాకుళం) లో ఉరివేసుకుని మృతి చెందింది. దీనికి గల కారణం తల్లిదండ్రులు ఆఫ్లైన్ క్లాసులకి వెళ్ళమని బలవంతం చేయడమే. బుధవారం నాడు ఆమె ఉరి వేసుకున్నట్లు కొంత మంది బాలికలు చూసి యాజమాన్యానికి చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూస్తే.. ఆమెని కొండపల్లి మనీషా అంజు గా గుర్తించారు. IIIT శ్రీకాకుళం లో మొదటి సంవత్సరం ఆమె చదువుతోంది. అయితే ఆన్లైన్ క్లాసులు ఇప్పటి వరకు జరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు విద్యార్థులు ఇంటి నుండే పాఠాలు విన్నారు. అయితే ఇంక కాలేజీకి వెళ్లి చదువుకోవాలని.. ఆఫ్లైన్ క్లాసులు అటెండ్ అవ్వాలని తల్లిదండ్రులు ఆమెకి చెప్పారు.
కానీ ఆమెకి ఆన్లైన్ క్లాసులు ఎటెండ్ అవ్వాలని ఉందని అసలు ఆఫ్ లైన్ క్లాసు కి వెళ్లాలని లేదని చెప్పింది. అయినప్పటికీ తల్లి దండ్రులు బలవంతంగా IIIT శ్రీకాకుళం లో దింపేసి వచ్చేసారు. బస్సులో వెళ్తున్నప్పుడు ఆమె తన మొబైల్ ఫోన్ ని విసిరేసింది. ఆ తర్వాత రోజు కొత్త ఫోన్ ని తల్లిదండ్రులు కొన్నారు. అయినప్పటికీ వారి యొక్క కష్టం వృధా అయిపోయింది. ఆమె హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ కి ఉరి వేసుకుని చనిపోయింది.