ఏపీ మహిళలకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మహిళల భద్రత కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణ కోసం మరో 163 దిశ పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం వాటిని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… ఓ మంచి కార్యక్రమానికి… ఒక కోటి మంది మహిళలు దిశా ఆప్ డౌన్లోడ్ చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. మహిళలపై అన్యాయం జరిగితే ప్రభుత్వమే ఊరుకోదు అని ఆయన హెచ్చరించారు.
ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్ లో 900 ద్విచక్ర వాహనాలు ఉన్నాయని… వీటితో పాటు మూడు వేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభిస్తున్నామని సీఎం జగన్ ప్రకటన చేశారు. ఈ దిశ పెట్రోలింగ్ వాహనాలు జీపీఎస్ ద్వారా కంట్రోల్ రూం కు అనుసంధానం అయి ఉంటాయని ఆయన వివరించారు.