ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కాణిపాకం ఒకటి. కోరికలు నెరవేర్చే మహిమగల పుణ్యక్షేత్రంగా కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయాన్ని దర్శించుకుంటారు భక్తులు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే తాజాగా కాణిపాకం సందర్శించే భక్తలుకు షాక్ ఇచ్చింది. టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భక్తులపై భారం పడనుంది. సాధారణంగా తిరుపతిని సందర్శించే ప్రతీ భక్తుడు కూడా కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకుంటారు. కాణిపాకంతో పాటు శ్రీకాళహస్తిని దర్శించుకుంటారు.
కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో దర్శనం, ఆర్జిత సేవా టికెట్ ధరలు పెంచారు. గణపతి హోమం టికెట్ ధర రూ. 500 నుంచి రూ. 1000 కి, శీఘ్రదర్శనం టికెట్ రూ.51 నుంచి రూ.100కు, అతి శీఘ్ర దర్శనం టికెట్ రూ. 150కి పెంచగా.. కొత్తగా ప్రత్యేక గణపతి హోమం సేవను ప్రవేశపెట్టారు. దీనికకి రూ. 2 వేలుగా ధర నిర్ణయించారు.