దేశంలో ఇప్పుడు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో పరిక్షల నిర్వహణ వాయిదా వేయాలని విద్యార్ధులు, వారి తల్లి తండ్రులు, పలు రాష్ట్రాల సిఎంలు కోరుతున్న సంగతి విదితమే. ఈ తరుణంలో ఒక 17 ఏళ్ళ బాలుడు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టీస్ కి లేఖ రాసాడు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో కరోన వైరస్ మహమ్మారి మరియు వరద సంక్షోభం దృష్ట్యా జెఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని వేడుకుంటూ 17 ఏళ్ల బాలుడు భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) శరద్ అరవింద్ బొబ్డేకు ఆదివారం ఒక లేఖ రాసాడు.
అతను మైనర్ అయినందున, సుప్రీంకోర్టు న్యాయవాది అలాఖ్ అలోక్ శ్రీవాస్తవ అతనికి అవసరమైన సహాయాన్ని అందించారు. 17 ఏళ్ల బాలుడు జెఈఈ పరిక్షలకు సిద్దమవుతున్నాడు. అంతకు ముందు, 2020 సెప్టెంబర్‌లో జరగాల్సిన నీట్, జెఈఈ నీట పరీక్షలను లను వాయిదా వేయాలని కోరుతూ దాఖలు అయిన పిటిషన్ ను ఆగస్టు 17 న సుప్రీం కోర్టు కొట్టివేసింది.