సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎటువంటి వార్త వైరల్ అవుతుందో తెలియదు..ఫేక్ వార్తలు ఈ మధ్య ఎక్కువ వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశంలో నిత్యావసర వస్తువుల పై జీఎస్‌టీ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. జులై 18 నుంచి కొన్ని వస్తువుల పై భారీగా జీఎస్టీ పెరిగిన సంగతి తెలిసిందే..
అయితే, దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రీ ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తులపై 5 శాతం జీఎస్టీని ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడంతో కేంద్రంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబశ్రీ, చిన్న దుకాణాలలో విక్రయించే వస్తువులపై ఎలాంటి జీఎస్టీ విధించబోమని ప్రకటించింది. కుటుంబశ్రీ , చిన్న దుకాణాలలో విక్రయించే 1, 2 కేజీల ప్యాకెట్ల వస్తువులపై, విడిగా అమ్మే వస్తువులపై ఎలాంటి పన్నును విధించమని కేరళ ఆర్ధిక మంత్రి వెల్లడించారు.
కాగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం శ్మశాన వాటిక సేవలపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారని సోషల్ మీడియాలో విస్తృతస్థాయిలో ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో అంత్యక్రియలపై జీఎస్టీ విధిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇది ముమ్మాటికీ తప్పు అని వెల్లడించింది. అంత్యక్రియలు, ఖననం, శ్మశానవాటిక, మార్చురీ సేవలపై ఎలాంటి జీఎస్టీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. జీఎస్టీ కేవలం పని ఒప్పందాలకు మాత్రమే వర్తిస్తుందని, సేవలకు కాదని తేల్చి చెప్పింది. ఈ విషయం పీఐబి సర్వేను నిర్వహించింది.. అయితే ప్రభుత్వం అలాంటివి ఏవి చేయలెదని కేవలం వస్తువుల పై మాత్రమే పెంచినట్లు స్పష్టం చేసింది.. ఇందుకు సంభంధించిన ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది..
Claim: There will be 18% GST on Crematorium Services.#PIBFactCheck
▶️This claim is #Misleading.
▶️There is no GST on funeral, burial, crematorium, or mortuary services.
▶️In this reference GST @ 18% is only applicable for work contracts and not the services. pic.twitter.com/7HE2MPMs1s
— PIB Fact Check (@PIBFactCheck) July 20, 2022