టూత్ పేస్ట్ కు బదులుగా ఎలుకల మందు తోమి యువతి మృతి

మహారాష్ట్రలోని ధరావి లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ యువతి.. టూత్ పేస్ట్ కు బదులుగా… ఎలుకల మందు వాడి మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం రోజున చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… మహారాష్ట్ర లోని ధారావి ఏరియా లో అప్సానా ఖాన్ అనే యువతి తన తల్లిదండ్రులతో నివాసం ఉంటోంది. ఆ అప్సనా ఖాన్ వయసు 18 సంవత్సరాలు.

అయితే… ఎప్పటిలాగే అఫ్సానా ఖాన్… సెప్టెంబర్ 3 వ తేదీన కూడా బ్రష్ వేయాలని అనుకుంది. ఈ నేపథ్యంలోనే టూత్ పేస్ట్ కు బదులుగా… ఎలుకలను చంపే ఎందుకు వాడే పేస్ట్ ను తన బ్రేష్ కు పెట్టుకుంది. పొరపాటున ఎలుకల మందు నే .. వేస్ట్ అనుకొని తోమేసింది అప్సనా ఖాన్. అయితే బ్రష్ వేసిన గంట సేపు అనంతరం… ఆ యువతి అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో ఆదివారం రోజున మృతి చెందింది.