ప్రేమ.. ప్రేమ ఎప్పుడు ఎవరిపైన పుడుతుందో ఎవరూ చెప్పలేరు. దీనికి నిదర్శనం ఈ ఘటన. 70 ఏళ్ల వృద్ధుడు, 19 ఏళ్ల యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య 51 ఏళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ దానిని పట్టించుకోక పెళ్లితో ఒక్కటయ్యారు. విస్తూ పోయే ఈ సంఘటన దాయాది దేశమైన పాకిస్థాన్‌లో జరిగింది. 70 ఏళ్ల లియాఖత్ అలీ, 19 ఏళ్ల షుమైలా ఇటీవల ప్రేమలో పడ్డారు. అంతేగాక తమ కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య 50 ఏళ్లకు పైగా వయసులో తేడా ఉన్న ఈ జంట ప్రేమ కథను యూట్యూబర్ సయ్యద్ బాసిత్ అలీ వెలుగులోకి తెచ్చారు. లియాఖత్ అలీ ప్రతి రోజూ మార్నింగ్ వాక్ చేసేవాడు.
ఈ క్రమంలో 19 ఏళ్ల షుమైలాతో అతడికి పరిచయం ఏర్పడింది. ఒక రోజున ఆమె వెనుక జాగ్ చేస్తున్న లియాఖత్ ఒక పాట పాడుతూ తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఆ యువతి కూడా ఆ వృద్ధుడి ప్రేమకు ఓకే చెప్పింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కాగా, 51 ఏళ్ల వయసు తేడా ఉన్న లియాఖత్ అలీ, షుమైలా దంపతులు తమ ప్రేమ పెళ్లి ముచ్చట్లను యూట్యూబర్ సయ్యద్ బాసిత్ అలీతో పంచుకున్నారు. ‘ప్రేమలో పడిన వారు వయసును చూడరు’ అని షుమైలా తెలిపింది. లియాఖత్ తో పెళ్లికి తన కుటుంబం తొలుత అభ్యంతరం తెలిపిందని, అయితే చివరకు వారిని ఒప్పించినట్లు ఆమె చెప్పింది.