చంద్రబాబుకి బైబై చెప్పడానికి జనం సిద్ధంగాలేరు జగన్ రెడ్డీ : పట్టాభి

-

మరోసారి ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ని అరాచకప్రదేశ్ గా మార్చిన జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతిపాలైందని ఆర్బీఐ నివేదికతో తేటతెల్లమైందని, నర్సాపురంలో జగన్ రెడ్డి అసహనానికి కారణం ఇదేనా? అని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిలోని అసహనం, కోపం, ఈర్ష్యాద్వేషాలు పతాకస్థాయికి చేరాయని, చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని ఏమారుమూల ప్రాంతానికి వెళ్లినా అక్కడ కనిపిస్తోన్న జన సునామీలే అందుకు కారణమని అన్నారు పట్టాభిరామ్. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో పట్టాభి మాట్లాడుతూ, “చరిత్రలో ఎన్నడూ చూడనంత జనం కర్నూలులో చంద్రబాబు పర్యటనకు వచ్చారు పట్టాభిరామ్.

TD leader Pattabhi Ram released on bail

సైకో ముఖ్యమంత్రి బాదుడు తట్టుకోలేక ప్రజలంతా ఏంఖర్మ-ఈ రాష్ట్రానికి అంటూ మనోవేదనతో, గతంలో చంద్రబాబునాయుడి గారి సుపరిపాలన గుర్తుచేసుకొని తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయన్న ప్రగాఢవిశ్వాసంతోనే ఘన నీరాజనాలు పలుకుతున్నారని అర్థమవుతోంది. నేడు నరసాపురంలో జరిగిన ముఖ్యమంత్రి సభకు ప్రజల్ని ఇళ్లనుంచి బలవంతంగా లాక్కొచ్చి, బస్సుల్లో కుక్కి తరలించినాకూడా ప్రజలు మధ్యలోనే బారికేడ్లు దూకి పారిపోయారు. ముఖ్యమంత్రి, వైసీపీనేతలు చెప్పే అబద్ధాలు వినలేక జనం పరుగులు పెడుతుంటే, పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. తెలుగుదేశంపార్టీ చేపట్టబోతున్న ‘ఇదేంఖర్మ-మనరాష్ట్రానికి’ కార్యక్రమంపై జగన్ రెడ్డి తన అక్కసంతా వెళ్లగక్కాడు.

ఏవర్గంవారిని పలకరించినా అందరినోటా ఒకటేమాట ‘ఇదేంఖర్మ-మనరాష్ట్రానికి’. చంద్రబాబుకి బైబై చెప్పడానికి జనం సిద్ధంగాలేరు జగన్ రెడ్డీ! బాబాయ్ కి బైబై చెప్పినంత తేలికకాదు.. మా పెద్దాయనకి బైబైచెప్పడం అంటే. జగన్ రెడ్డీ…నిన్ను భూస్థాపితం చేసేవరకు చంద్రబాబునాయుడు గారు విశ్రమించరని గుర్తుపెట్టుకో. 98శాతం హామీలు నెరవేరిస్తే, ప్రజలంతా నీ పక్కనుంటే నరసాపురం పట్టణంలోని ప్రతిసందులో బారికేడ్లు ఎందుకుపెట్టారో చెప్పు?’ అని పట్టాభి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news