డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా మిగిలిపోయిన రెండు లక్షలకు పైగా సీట్లు…

-

డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా రెండు లక్షలకు పైగా సీట్లు మిగిలి పోనున్నాయి. డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ (దోస్త్) సీకండ్ ఫేస్ లో కొత్తగా 60 వేల 539 మందికి సీట్లు కేటాయించారు. మొదటి విడతలో సీటు కంఫర్మ్ చేసుకుని ఇతర కాలేజికి అప్లై చేసుకున్న వారిలో 5 వేల మంది కి రెండో విడతలో కేటాయించారు.

మొదటి విడతలో లక్షల 41 వేల మందికి సీట్లు కేటాయిస్తే కంఫర్మ్ చేసుకున్న వారు లక్షా 7 వేల 645 మంది మాత్రమే, దోస్త్ పరిదిలో ఉన్న 986 డిగ్రీ కళాశాలల్లో 4 లక్షల 9 వేల 456 సీట్లు ఉంటే… రెండో విడత కేటాయింపు ల తర్వాత ఇంకా 2 లక్షల 41 వేల 266 సీట్లు మిగిలే ఉన్నాయి. ఇక దోస్త్ లో సీట్లు అలాట్ ఆయన వారు వెంటనే కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని, చివరి క్షణాల్లో రిపోర్ట్ చేయాలని అనుకుంటే రష్ పెరిగి ఆన్లైన్ రిపోర్టింగ్ కి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని దోస్త్ కన్వీనర్ లింబాద్రి చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news