ఘోర ప్రమాదం : కారులో కూర్చున్న ఇద్దరు సజీవ దహనం

Join Our Community
follow manalokam on social media

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాలలో కారు బీభత్సం సృష్టించింది. తూర్పుగోదావరి జిల్లాగోకవరం నుంచి వైజాగ్ వెళుతున్న కారు మల్లిసాల వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో విద్యుత్ స్తంభం విరిగి కారు మీద పడడంతో కారులో మంటలు చెలరేగాయి.

కారులో ఐదుగురు ఉండగా ముగ్గురు బయట పడ్డారు. ఇద్దరు కార్లోనే ఉండిపోయారు. దీంతో వారు మంటల్లో సజీవదహనమయ్యారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పొగమంచు, అధిక వేగం ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చనిపోయిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.

TOP STORIES

జీవితంలో గెలవడానికి అలవర్చుకోవాల్సిన ఐదు అలవాట్లు..

కొన్ని అలవాట్లు మన జీవితాలని మార్చేస్తాయి. అలాగే మరికొన్ని అలవాట్లు మనల్ని విజయ తీరాలకి దూరంగా పడవేస్తాయి. ఇంకొన్ని అలవాట్లు విజయ సంద్రంలో నిత్యం తడిచేలా...