వరుణ్ తేజ్ ‘గని’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?

Join Our Community
follow manalokam on social media

మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గని పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు. తాజాగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాని జూలై 30 వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా కొద్ది సేపటి క్రితం నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాని సిద్దు ముద్ద అలాగే అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీ ఇద్దరూ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి లాంటి ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలు నటిస్తుండడంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా కూడా హిట్ అయితే తమకు తిరుగులేదని భావిస్తున్నారు వరుణ్ తేజ్ ఫ్యాన్స్.

TOP STORIES

యూపీఐ ద్వారా చెల్లింపులు జ‌రుపుతున్నారా ? ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ ఎంతో తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం దాదాపుగా ఎవ‌రిని చూసినా డిజిట‌ల్ పేమెంట్ల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. న‌గ‌దుతో లావాదేవీల‌ను చాలా త‌క్కువ‌గా చేస్తున్నారు. కార‌ణం.. బ‌య‌ట ప్ర‌తి చోటా ఆన్‌లైన్ లో...