తెలంగాణలో మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర !

Join Our Community
follow manalokam on social media

తెలంగాణ కాంగ్రెస్ లో పాదయాత్రల హడావుడి మొదలు కానుంది. కాంగ్రెస్ లో పాదయాత్రకు మరో ఇద్దరు నేతలు సిద్ధమైతున్నట్టు చెబుతున్నారు. ఈ నెల 19 నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్ర జరగనున్నట్టు చెబుతున్నారు. నార్కట్ పల్లి నుండి ఎస్ ఎల్ బీ సి వరకు కోమటిరెడ్డి పాదయాత్ర కి సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు.

మరో పక్క 22 నుండి వారం పాటు జగ్గారెడ్డి పాదయాత్ర జరగనుంది. సదాశివపేట నుండి..గన్ పార్క్ వరకు పాదయాత్ర చేయాలని జగ్గారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అచ్చం పేట నుండి రేవంత్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.  మొత్తం మీద ఈ పోటాపోటీ పాదయాత్రలు అటు కాంగ్రెస్ వర్గాలలోనే కాక ఇటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పీసీసీ కోసం గట్టి పోటీ నెలకొంది. ఈ సమయంలో ఇలా పోటాపోటీ పాదయాత్రలు చేస్తూ ఉండడం కూడా ఒకరకంగా చర్చనీయంశంగా మారింది. 

TOP STORIES

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా మొదలైంది?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మనందరికి తెలుసు. ఈ మహిళా దినోత్సవం వేడుకలు చేసుకోవడానికా? లేదా ఆందోళనలు నిర్వహించడానికా? అసలు దేనికోసం నిర్వహించుకుంటారో తెలుసా? శతాబ్దం కిందట...