విచిత్రం : కేరళలో ఓటేసిన 2 ఏళ్ల పాప..?

-

ఎన్నికల పోలింగ్ అంటే ప్రజాస్వామ్యానికే పండుగ రోజు. అందుకే ఓట్ల రోజు ఓటేయాగానే ఘనంగా ఓటేసిన వేలితో సెల్ఫీ దిగి చాలా మంది సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. అదో ఘన కార్యంగా ఫీలవుతుంటారు. కానీ ఇలా ఫోటో దిగాలంటే మాత్రం18 ఏళ్లు నిండాలి. కానీ కేరళలో మాత్రం ఓ రెండేళ్ల పాప తన వేలిపై సిరా చుక్కతో ఫోటోలకు ఫోజు ఇచ్చింది.

రెండేళ్ల ఓటరు గా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఏం జరిగింది. ఆ పాప రెండేళ్లకే ఎలా ఓటేసింది.. అసలు విషయం ఏంటంటే.. కేరళలోని అలప్పుళ జిల్లా అరూర్ లో ఓ రెండేళ్ల పాప ఓటరుగా మారింది. కృష్ణ అనే రెండేళ్ల అమ్మాయి తన తల్లితో కలిసి పోలింగ్ బూత్ కు వచ్చింది.

తల్లి పాపను చంకలో ఎత్తుకుని ఓటేసి వచ్చింది. ఆ తర్వాత తల్లి వేలిపై ఓటు వేసినందుకు గుర్తుగా అధికారులు సిరా చుక్క వేశారు. అది చూసి ఆ పాప తనకు కూడా సిరా చుక్క పెట్టమని అడిగింది. ఎన్నికల సిబ్బంది నచ్చజెప్పినా ఆ పాప వినలేదు. సిరా చుక్క వేసేంత వరకూ అక్కడి నుంచి కదలనని మొరాయించింది.

ఇక పాప గోల భరించలేక ఎన్నికల సిబ్బంది ఆ పాప వేలికి కూడా సిరా చుక్క వేశారు. ఆ పాప తల్లి ఆ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. దీన్ని చూసి ఈ పాప రెండేళ్లకే ఓటేసిందా అంటూ జనం ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయం ఇదీ.

Read more RELATED
Recommended to you

Latest news