ఆ కులం కోసం గడ్డి తింటారా.. చంద్రబాబుపై వైసీపీ ఫైరింగ్

-

టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత సామాజిక వర్గం కోసం ఎంతకైనా దిగజారతారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబుకు ప్రతి అంశంలోనూ తన సొంత కులం ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. ఒక ఎస్సీని కులం పేరుతో దూషించిన ఎన్‌జీ రంగా యూనివర్సిటీ వీసీ దామోదర్‌నాయుడును చంద్రబాబు వెనకేసుకురావడాన్ని వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తీవ్రంగా తప్పుబట్టారు.

యూనివర్శిటీ విషయాల్లోనూ చంద్రబాబుకు కులమే కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎజెండా ఒక్కటేనని, తమ కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులను కాపాడుకోవడమే అన్నారు. మిగతా కులాల వారు ఏమైనా టీడీపీకి ఫర్వాలేదని, పచ్చ చొక్కాల పరిరక్షణే వారి ధ్యేయమన్నారు. దామోదర నాయుడు విషయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని గవర్నర్ ను కలవడాన్ని నాగార్జున తప్పుబట్టారు.

దామోదర్‌ నాయుడికి, టీడీపీకి, కేశినేని నానికి కులం ఒక్కటే సంబంధం అన్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని కాపాడుకునేందుకు అడ్డంగా గడ్డి తినడానికి కూడా టీడీపీ నేతలు వెనుకాడరన్నారు. మీ పరిపాలనలో నాగార్జున యూనివర్సిటీలో బీసీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు అక్కడి ప్రిన్సిపాల్‌ కారణమైతే ఆయన్ను వెనుకవేసుకొచ్చారని తెలిపారు. అణగారిన కులాల మనుగడ మీకు పట్టదా ? అని ధ్వజమెత్తారు.

ఎవరైనా గవర్నర్‌ను కలవొచ్చు అని, కానీ తమ తప్పులు కప్పిపుచ్చుకుంటూ, దళిత చట్టాలను అవహేళన చేస్తూ, అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని అవహేళన చేసిన నాయకులు వైయస్‌ జగన్‌ పాలనపై నిందలు వేయడం దారుణమని నాగార్జున అన్నారు. వైయస్‌ జగన్‌ నిర్ణయాలతో పేదలకు మేలు జరుగుతుంటే గవర్నర్‌పై ఎవరిపై ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. కులం పేరుతో తిట్టి అవహేళన చేస్తే కేసులు పెట్టరా అని నాగార్జున నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news