ఆర్టిస్టులకి, సాంకేతిక నిపుణులకి 20శాతం కట్..

-

మహమ్మారి వచ్చినప్పటి నుండి పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. ఎన్నో వ్యాపారాలు అడ్రెస్ లేకుండా పోయాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. కరోనా కారణంగా ఇబ్బంది పడ్డ వ్యాపారాల్లో సినిమా రంగం కూడా ఒకటి. సినిమా షూటింగులన్నీ ఆగిపోయి, రోజు వారి సినీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఐతే ప్రస్తుతం సినిమా షూటింగులు మొదలయ్యాయి. థియేటర్లు కూడా మొదలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు సినిమా నిర్మాతల మండలి ఒక నిర్ణయానికి వచ్చారు.

ప్రస్తుతం జరుగుతున్న సినిమా షూటింగులకి ఆర్టిస్టులకి ఇచ్చే పారితోషికంలో 20శాతం తగ్గిస్తారట. కరోనాకి ముందు వారికిచ్చే పారితోషికంలో 20శాతం కట్ చేస్తారట. రోజుకి 20వేలు కంటే ఎక్కువ పారితోషికం తీసుకునే నటీనటులకి, అలాగే సినిమా మొత్తానికి 5లక్షలు ఆపై ఎక్కువ పారితోషికం తీసుకునే సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లో 20శాతం కట్ చేయాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, నిర్మాతల మండలి నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news