జొమాటోకి లాభాలొచ్చాయ్‌.. 20 శాతం పెరిగిన షేరు!

-

ఉదయాన్నే లేవగానే బ్రేక్ ఫాస్ట్ కి రెడీ అవ్వమంటూ.. మధ్యాహ్నం కాగానే లంచ్ చేయమంటూ నోటిఫికేషన్లతో వ్యూయెర్స్ ని ఆకర్షించే ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోకు చాలా రోజుల నుంచి లాభాలు లేవు. జొమాటో షేరు చాలా రోజుల తర్వాత మురిసింది.

ఇవాళ జరిగిన ట్రేడింగ్ లో కంపెనీ షేరు విలువ దాదాపు 20 శాతం పెరిగింది. ఇటీవల కాలంలో భారీగా విలువ కోల్పోయిన ఆ కంపెనీకి ఇది ఊరటనిచ్చే అంశమే. జూన్‌ త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ నష్టాలు తగ్గడం, ప్రతి విభాగానికి ఒక సీఈఓ నియామకం వంటివి షేరు దూసుకెళ్లడానికి దోహదం చేశాయి.

జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి ఆగస్టు 1న జొమాటో ఫలితాలను వెలువరించింది. గతేడాది రూ.359 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిన ఆ కంపెనీ.. ఈ ఏడాది రూ.186 కోట్లు మాత్రమే ప్రకటించింది. కంపెనీ ఆదాయం సైతం 67.44 శాతం వృద్ధితో రూ.1413.9 కోట్లు పెరిగింది.

మరోవైపు కంపెనీ తన బిజినెస్‌ విభాగాలకు వేర్వేరు సీఈఓలను నియమించింది. గ్రాసరీ డెలివరీ స్టార్టప్‌ బ్లింకిట్‌ను కొనుగోలుకు బోర్డు ఇటీవల ఆమోదం తెలిపింది. అలాగే జొమాటో, బ్లింకిట్‌, హైపర్‌ప్యూర్‌ (రెస్టారెంట్లకు సరకులు డెలివరీ చేసే సంస్థ), ఫీడింగ్‌ ఇండియా (ఎన్జీవో)కు వేర్వేరుగా సీఈఓలను నియమిస్తునట్లు జొమాటో సీఈవో, సహ వ్యవస్థాపకుడు దీపీందర్‌ గోయల్‌ పేర్కొన్నారు.

కంపెనీ నష్టాలు తగ్గడం, వేర్వేరు విభాగాలకు సీఈఓలను నియమించడంతో చాలా వరకు బ్రోకరేజీ సంస్థలు జొమాటో షేరు కొనుగోలుకు సిఫార్సు చేశాయి. గోల్డ్‌మెన్‌ శాచ్‌, మోర్గాన్‌ స్టాన్లీ, యూబీఎస్‌ వంటి సంస్థలు రూ.80-100 మధ్య టార్గెట్‌ ప్రైస్‌ వద్ద కొనుగోలు చేయొచ్చని సూచించాయి. దీంతో సోమవారం రూ.46.30 వద్ద ముగిసిన జొమాటో షేరు విలువ.. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో భారీగా పుంజుకుంది. 19.98 శాతం లాభంతో రూ.55.55 వద్ద ముగిసింది.

గతేడాది జులైలో ఐపీఓకు వచ్చిన జొమాటో షేరు విలువ రూ.169 పలకగా.. ఓ దశలో 40.46 కనిష్ఠానికి చేరిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు కంపెనీ పేరును కూడా ఈటర్నల్‌ లిమిటెడ్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news