రూ.కోట్లు ఖ‌రీదు చేసే కారుతో బ‌య‌ట‌కు వ‌చ్చాడు.. గుంజీలు తీశాడు..!

-

అవును.. చ‌ట్టానికి ఎవ‌రూ అతీతులు కారు.. చ‌ట్టం ముందు అంద‌రూ సమానులే. పేద‌లైనా, ధ‌నికులైనా చ‌ట్టం ముందు త‌ల‌వంచాల్సిందే. అందులోనూ క‌రోనా లాక్‌డౌన్ ఉన్న స‌మ‌యంలో నిబంధ‌న‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రూ పాటించాల్సిందే. లేదంటే.. ఎంత‌టి వారికైనా శిక్ష‌లు త‌ప్ప‌వు.. అవును.. అందుకనే ఆ వ్య‌క్తి కొన్ని కోట్ల రూపాయ‌ల విలువ చేసే పోర్షె కారును న‌డుపుతున్నా.. అత‌ని తండ్రి పెద్ద వ్యాపార‌వేత్త అని తెలిసినా.. ఆ యువ‌కుడికి త‌గిన శిక్ష వేశారు. లాక్‌డౌన్ వేళ బ‌య‌ట‌కు వ‌చ్చినందుకు గాను ఆ యువ‌కుడితో అధికారులు గుంజీలు తీయించారు.

20 year old done sit ups for coming on road with his Porsche car

ఇండోర్‌లో 20 ఏళ్ల ఓ యువ‌కుడు ఎల్లో క‌ల‌ర్ పోర్షె కారులో రోడ్ల‌పై తిరుగుతుండ‌గా.. అధికారులు అత‌న్ని అదుపులోకి తీసుకుని.. క‌రోనా లాక్‌డౌన్ వేళ బ‌య‌ట‌కు ఎందుకు వ‌చ్చావ్‌.. అంటూ నిల‌దీశారు. అత‌ను స‌మాధానం చెబుతున్నా విన‌కుండా.. అత‌నిచే అధికారులు గుంజీలు తీయించారు. ఈ క్ర‌మంలో తీసిన వీడియో ఒక‌టి ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతోంది.

అయితే ఆ యువ‌కుడి కారుకు బ‌య‌ట తిరిగేందుకు పాస్ ఉంద‌ట‌. కానీ దాన్ని ఆ అధికారులు చూడ‌లేద‌ని, చూడ‌కుండానే ఆ యువ‌కుడితో వారు గుంజీలు తీయించార‌ని మ‌రొక వార్త ప్ర‌చారంలో ఉంది. అయితే ఈ విష‌యంపై నెటిజ‌న్లు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్ని కోట్లు ఖ‌రీదు చేసే కారులో తిరిగినా.. ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే.. ఎవ‌రికైనా స‌రే శిక్ష వేయాల్సిందేన‌ని నెటిజ‌న్లు అంటున్నారు..!

Read more RELATED
Recommended to you

Latest news