మౌన సాక్ష్యం – మచ్చుతునక @ ఆగస్టు 28!

-

ప్రజాగ్రహం ప్రజ్వరిల్లిన రోజు.. తెలుగు రాష్ట్రాల్లోనే చేదు జ్ఞాపకం.. అమాయకులను పొట్టనపెట్టుకున్న రోజు.. బాబు పాలనకు మచ్చుతునకగా మిగిలిన రోజు.. అవును… బషీర్ బాగ్ కాల్పుల ఘటన జరిగిన నేటికి 20ఏళ్లు! బాబు రక్తపాత రాజకీయ నిర్ణయాలకు, అనాలోచిత ఆలోచనలకు, ప్రజలపై తనకున్న చిన్నతనం చూపులకు చరిత్రలో ఫలితంగా నిలిచిన రోజు!

2000 సంవత్సరం ఆగస్టు 28న విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఉద్యమబాట పట్టిన రైతన్నలపైనా… వారికి ప్రజలు ఇచ్చిన మద్దతు ఫలితంగా… వారంతా కలిసి ఉప్పెనలా కదిలారు. బషీర్ బాగ్ నుంచి అసెంబ్లీ వైపు ర్యాలీగా కదిలారు.. న్యాయం కోసం రోడ్డెక్కిన రైతులపై చంద్రబాబు సర్కార్ కన్నెర్రచేసిన రోజు… భాగ్యనగర రోడ్లు అమాయకులైన ప్రజల రక్తపు మరకలతో నిండిపోయిన రోజు. ఫలితంగా… సత్తెనపల్లి రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డిలకు తుపాకీ గుళ్లకు అసువులు బాసిన రోజు!

దీంతో… రైతుల పోరాటాలకు, నాటి చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది బషీర్ భాగ్! అమరుల త్యాగాలకు గుర్తుగా బషీర్ బాగ్ లో నిర్మించిన స్థూపం నాటి ఘటనకు మౌన సాక్ష్యంగా నిలిస్తే… రైతులపైనా, ప్రజలపైనా బాబుకున్న ఆలోచనా విధానానికి మచ్చుతునకగా మిగిలింది ఆ రోజు! ఇది చరిత్ర మరువని రోజు.. రైతు మరిచిపోలేని రోజు.. చంద్రన్న రక్తపాత దినోత్సవంగా చరిత్ర పుటలో నిలిచిన రోజు! మళ్లీ అలాంటి రోజు రావొద్దని ప్రతి రైతు కోరుకునే రోజు!!

Read more RELATED
Recommended to you

Latest news