గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 43 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనా వేస్తున్నట్లు నిన్న పోలింగ్ ముగిసే సమయానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రక్తటించింది. తుది ప్రకటన రావడానికి చాలా సమయం పడుతుందని ముందు ప్రకటించి అర్ధరాత్రి దాటాక ఒక ఫిగర్ ప్రకటింది. ఫైనల్ గా 45.71 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రకటించారు.
కానీ కొద్ది సేపటి క్రితం మరో పోలింగ్ శాతాన్ని ప్రకటించింది. ఫైనల్ ఓట్ పర్సంటేజ్ 46.60 శాతం అని ఎన్నికల సంఘం ప్రకటించింది. నిన్న సాయంత్రం 5 గంటల వరకూ 36.73 పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. తుది ప్రకటనకు వచ్చేసరికి ఏకంగా 10 శాతం పోలింగ్ పెరగడం ఆసక్తికరం. 2002 ఎన్నికల్లో 41.22 శాతం, 2009లో 42.95 శాతం, 2016లో 45.27 నమోదయింది. అంటే గతంలో కంటే ఒక శాతం ఓటింగ్ పెరిగింది. యూసుఫ్ గూడ డివిజన్ లో అత్యల్పంగా 32.99%, కాంచన్ బాగ్ డివిజన్ లో అత్యధికంగా 70.39% పోలింగ్ నమోదు అయింది.