ఒక పక్క కరోనాతో రైతులకు కంటి మీద కునుకు లేదు. వాణిజ్య పంటలు వేసిన రైతులు అందరూ కూడా ఇప్పుడు రోడ్డున పడ్డారు. వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దేశంలో ఉంది. తినడానికి తిండి కూడా అన్నదాతకు లేదు. చేసిన అప్పులు… రాబోయే పంటలకు పెట్టుబడులు… ఎక్కడా కూడా రైతుకి ఊపిరి ఆడటం లేదు. రైతులకు ఏ విధంగా చూసినా సరే 2020 లో రైతులకు అన్నీ కష్టాలే.
ఇక ఇప్పుడు దేశానికి మిడతల దండు పొంచి ఉంది. భారత్‌లోకి గత నెల 11న ఈ మిడతలు వచ్చాయి. రాజస్థాన్‌లో 18జిల్లాలు, ఉత్తరప్రదేశ్‌లోని 17జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. 27ఏళ్లలో ఎన్నడూ లేనంత ఈ ముప్పు ఉందని గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అంటున్నాయి. వేలాది ఎకరాల్లో పంటలను అవి గంటల వ్యవధిలో తినేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఆ దరిద్రం తెలంగాణా వరకు రానుంది.
మహారాష్ట్రలో అడుగు పెట్టాయి… అక్కడి నుంచి మిడతలు తెలంగాణకు వస్తాయి. దీనితో తెలంగాణా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలు భయపడుతున్నాయి. తమిళనాడు లో పంటలు ఇప్పుడు ఎక్కువగా ఉంటాయి. దీనితో ఆ రాష్ట్రాలు అన్నీ కూడా ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాక భయపడుతున్నాయి. ఇప్పటికే నష్టపోయామని ఇప్పుడు ఈ దండు కూడా వస్తే తమ బతుకులు ఏంటీ అంటూ పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.