ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. “జగనన్న పాలవెల్లు” కార్యక్రమం ప్రారంభం

-

ఏపీ రైతులకు సిఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ కృష్ణా జిల్లాల్లో జగనన్న పాలవెల్లు కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు సీఎం వైయస్‌.జగన్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో ఏపీ పాలవెల్లువ ద్వారా పాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని.. ఒక్కడే కొనేవారు అమ్మేవాళ్లు అనేక మంది ఉంటే..కొనేవాళ్లు ఎంత చెప్తే.. అంతకు అమ్మాల్సిన పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు.

ఇలాంటి మార్కెట్‌ను ఇవాళ మన రాష్ట్రంలో కూడా చూస్తున్నామని.. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుందన్నారు. ఇవాల్టి నుంచి కృష్ణా జిల్లాల్లో రైతులకు, మహిళలకు మరింత మంచి ధర లభించనుందని.. అమూల్‌ ద్వారా పాలసేకరణ ప్రారంభించిన ఏడాదిలోగానే 5 జిల్లాల్లో కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇవాళ ఆరో జిల్లాల్లో కార్యక్రమం ప్రారంభిస్తున్నామని.. మిగిలిన 7 జిల్లాల్లో కూడా త్వరలోనే పాలసేకరణ ప్రారంభం అవుతుందని చెప్పారు. ధరల స్థిరీకరణతో ప్రభుత్వం మార్కెట్లోకి ప్రవేశించి రైతులకు మంచి ధరలు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని.. దీనివల్ల వ్యాపారులు కూడా మంచి ధరలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news