షాకింగ్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 21 కేజీల వజ్రాభరణాలు పట్టివేత !

-

శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా ముంబై కి తరలించేందుకు పంపిన కొరియర్ లో భారీగా వజ్రాభరణాలు, బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ , ఎయిర్ కార్గోలో ఈ ఉదయం ఎయిర్ ఇంటెలిజెన్స్ అండ్ కస్టమ్స్ అధికారుల విస్తృత తనిఖీలు చేశారు. 5 గంటలుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఇన్స్పెక్టర్ల సభ్యుల బృందంతో తనిఖీలు కొనసాగుతున్నాయి. ముంబయికి తరలించేందుకు స్మగ్లర్ పన్నిన పన్నాగాన్ని పసిగట్టిన కస్టమ్స్ అధికారుల బృందం ఈ తనిఖీలు చేపట్టింది.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ ఎత్తున బంగారం డైమండ్ జ్యువలరీ ఆభరణాలు అక్రమ రవాణా జరుగుతుందని ఎయిర్ పోర్ట్ లోని ఎయిర్ కార్గోలో ఈ రవాణా జరుగుతోందని సమాచారం అందింది. ఆ కొరియర్ ని ఓపెన్ చేసి డైమండ్ వజ్రాభరణాలను పెద్ద పెద్ద వెయిట్ మిషన్ల సహాయంతో లెక్కిస్తున్నారు అధికారులు. వజ్రాభరణాలు బంగారానికి పైనుండి వెండి పూత పూసి బంగారాన్ని గుర్తుపట్టకుండా అమర్చి గోల్డ్ మాఫియా తరలిస్తున్నట్టు గుర్తించారు. ముంబై వెళుతున్న పార్సెల్ లో వజ్రాభరణాలు, బంగారం , ఆర్నమెంట్స్ అన్నీ కలిపి ఇప్పటిదాకా 21 కేజీల వస్తువులు గుర్తించారు. ఇక వీటి విలువ 30 కోట్ల పైబడి ఉంటుందని అంచనా శ్రీపాల్ జైన్ అనే వ్యక్తీ ఈ పార్సిల్ ని ముంబయి అడ్రస్ కి పంపుతున్నట్టు ఉండగా అశోక్ అనే వ్యక్తి నుండి పార్సల్ ఫ్రమ్ అడ్రస్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news