ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి వణికయిస్తుంటే.. బీహార్ రాష్ట్రాన్ని మాత్రం కరోనా పాటు పిడుగులు కూడా వణికిస్తున్నాయి. దీంతో గత 24 గంటల వ్యవధిలో 22 మంది మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బీహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు 24 గంటల వ్యవధిలోనే పిడుగుపాటుకు గురై 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటన విడుదల చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో వీరు మృతి చెందినట్లు పేర్కొంది. అసమ్ లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది. మరో ఐదు రోజుల పాటు భారీవర్షాలు పడతాయని వాతావరణ విభాగం వెల్లడించింది. మరోవైపు అనేక ప్రాంతాల్లో వరద భయంతో ప్రజలు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరి అయితే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని అధికారులు స్పష్టం చేశారు. అయితే గత నెలలో కూడా బీహార్‌లో పలు చోట్ల పిడుగులు పడి పన్నెండు మంది ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.