కేసీఆర్ పై నిప్పులుచెరిగిన రేవంత్ రెడ్డి..!

-

తెలంగాణ ప్రభుత్వం పై ఉన్న అసంతృప్తితో తెలంగాణ ఐ‌పీఎస్ అధికారి టీ‌ఎస్‌పీ‌ఏ డైరెక్టర్ వీకే సింగ్ ముందస్తు రిటైర్ మెంట్ తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. కాగా దీనిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. జైళ్ల‌శాఖ‌లో ప‌నిచేస్తూ… ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టిన డీజీ వీకే సింగ్ కు అన్ని అర్హ‌త‌లున్నా ప్రమోష‌న్ రాకుండా అడ్డుకుంటున్నార‌న్నారు. సీఎస్ కు లేఖ రాసిన ఫ‌లితం లేకపోవ‌టంతో సీఎం కేసీఆర్ ప్ర‌వ‌ర్త‌న‌పై విసిగిపోయి వీకే సింగ్ గాంధీ జ‌యంతిన రిలీవ్ చేయాల‌ని ముంద‌స్తు రిటైర్మెంట్ కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌న్నారు రేవంత్ రెడ్డి.. అలాగే గత పదేళ్ళలో అదనపు ఎస్పీలుగా, డీఎస్పీలుగా పనిచేసిన తన బంధువులు, తన సామాజిక వర్గానికి చెందినవారు రిటైరైనా సరే సీఎం కేసీఆర్ ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని, పిలిచి మరీ పెద్ద పదవులు అప్పగిస్తున్నారని సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి.

నర్సింగ్ రావు, వేణుగోపాల్ రావు, కిషన్ రావు, మదన్ మోహన్ రావు, విజయ్ కుమార్ రావు, వెంకట్రావు, రమణారావు, రాఘవరావు, వెంకటరమణారావులు రిటైరైనా కీలక పదవుల్లో కూర్చోబెట్టారని మండిపడ్డారు. వీరిలో చాలామంది కేసీఆర్ కు అనుకూలంగా పనిచేయడానికి పలు కీలక శాఖల్లో నియమితులయ్యారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వీరందరూ ఎస్ఐబీల్లో, ఇంటెలిజెన్స్ విభాగంలో, ఏసీబీలో, పోలీస్ అకాడమీలో పదవులు పొందారని వివరించారు. ఇలాంటి నియామకాల కారణంగా టెలిఫోన్ ట్యాపింగ్ అనేది నిరాటంకంగా సాగుతోందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news