ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకి గుడ్ న్యూస్. ఇండియా పోస్ట్ ఆంధ్రప్రదేశ్ లో 2296 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడే తెలుసుకోండి. వివరాల లోకి వెళితే… 2021 ఫిబ్రవరి 26 లోగా అప్లై చేయాలి. పోస్టులని చూస్తే… ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు 2296 ఉన్నాయి.
జనరల్ లేదా అన్ రిజర్వ్డ్ కేటగిరిలో 947, ఓబీసీ 507, ఈడబ్ల్యూఎస్ 324, పీడబ్ల్యూడీ-ఏ-18, పీడబ్ల్యూడీ-బీ-34, పీడబ్ల్యూడీ-సీ- 35, పీడబ్ల్యూడీ-డీఈ-9, ఎస్సీ 279, ఎస్టీ 143 పోస్టులున్నాయి. అభ్యర్థులు 10వ తరగతి పాస్ కావాలి గుర్తుంచుకోండి. మ్యాథ్స్, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషకు సంబంధించిన సబ్జెక్ట్స్‌లో పాస్ అయ్యి ఉండాలి. అలానే స్థానిక భాషకు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి.
వివరాలను https://appost.in/ వెబ్ సైట్ లో చూడొచ్చు. ఆన్ లైన్ లో మాత్రమే మీరు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌వుమెన్, దివ్యాంగులకు ఫీజు లేదు. 2021 జనవరి 27 నాటికి 18 నుంచి 40 ఏళ్లు వయస్సు ఉండాలి. ఇక వేతనం వివరాలని చూస్తే.. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం) పోస్టుకు రూ.12,000, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-(ఏబీపీఎం) , గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) పోస్టుకు రూ.10,000 వస్తుంది. https://appost.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. దాని ఆధారంగా మీరు సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు.