పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ సినిమాలకి బ్రేక్ ఇస్తాడా ?

-

పవన్‌ కళ్యాణ్ కమ్‌ బ్యాక్ ఇచ్చాడని ఆనంద పడుతోన్న ఫ్యాన్స్‌కి మళ్లీ టెన్షన్‌ తప్పట్లేదు. జనసేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని ఫ్యాన్స్‌ అంతా వర్రీ అవుతున్నారు. పవర్‌ స్టార్ మళ్లీ బ్రేక్‌ తీసుకుంటాడేమో అని బాధపడుతున్నారు. అంటే పవన్‌ మళ్లీ సినిమాలకి బ్రేక్ ఇస్తున్నాడా అన్న చర్చ అటు టాలీవుడ్ తో పాటు ఇటు పవన్ ఫ్యాన్స్ లోనూ మొదలైంది.

పవన్‌ కళ్యాణ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తున్నాడని ఆనంద పడుతున్నారు ఫ్యాన్స్‌. అయితే ఈ ఆనందంలో ఉన్న అభిమానులకి షాకింగ్‌ మేటర్ చెప్పాడు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహార్. చిరంజీవి నచ్చచెప్పడంతోనే పవన్‌ సినిమాల్లోకి వచ్చాడు. ఎన్నికలకి చాలా టైమ్ ఉంది. ఒక రెండుమూడేళ్లు సినిమాలు చేసి, మళ్లీ పాలిటిక్స్‌కి ఫుల్‌ టైమ్‌ కేటాయించమని చెప్పాడు. పవన్‌ కూడా పార్టీ బలోపేతానికి సినిమాలు చేస్తున్నాడని చెప్పాడు.

పవన్‌ కళ్యాణ్‌ ఫుల్‌ స్పీడ్‌గా సినిమాలు చెయ్యడానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది. 2024 ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి సినిమాలు పక్కనపెట్టేసి, పూర్తిగా రాజకీయాలనే ఫోకస్‌ చేస్తాడట పవన్. అందుకే ఉన్న ఈ షార్ట్‌గ్యాప్‌లోనే మ్యాగ్జిమమ్‌ సినిమాలు చెయ్యాలనుకుంటున్నాడట పవన్.

పవన్ కల్యాణ్‌ ఇప్పుడు ‘వకీల్‌సాబ్’తో పాటు మరో నాలుగు సినిమాలకి సైన్ చేశాడు. క్రిష్‌ డైరెక్షన్‌లో పీరియాడికల్ డ్రామా, హరీశ్‌ శంకర్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌, సురేందర్ రెడ్డితో ఒక సినిమా, అలాగే ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కూడా చేస్తున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్స్‌ కంప్లీట్‌ అయ్యాక పవన్‌ సినిమాలు తగ్గించి, పొలిటికల్ యాక్టివిటీస్‌తో బిజీ అవుతాడని ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news