జనవరికి చైనాలో రోజుకు 25 వేల కొవిడ్‌ మరణాలు..? పరిస్థితి చేయిదాటిపోయిందా..?

-

చైనా ప్రజలు చేసిన పాపం ఏంటో.. కొవిడ్‌ వల్ల అల్లకల్లోలం అవుతున్నారు. కొవిడ్‌ ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లోనే ఎన్నో వేల మరణాలు సంభవించాయి..మనలాగే వాళ్లకు కుటుంబం ఉంటుంది కదా.. ! స్నేహితులను, బంధువులను కోల్పోయారు.. మళ్లీ ఇప్పుడు అక్కడ అదే సీన్‌ రిపీట్‌ అవుతుంది. మరణ మృదంగం మోగుతుంది. రోజుకు 9 వేల మరణాలు సంభవిస్తున్నాయి అని అధికారిక లెక్కలు చెప్తున్నాయి.. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువే ఉండొచ్చు..

జనవరిలో మరింత ఉధృతం కానుందని వైద్యారోగ్య విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశంలో కోవిడ్ 19 వాస్తవ పరిస్థితిపై చైనా నుంచి అధికారిక సమాచారమేదీ రావడం లేదు. అయినా, పలు దేశాలకు చెందిన సంస్థలు చైనాలో పరిస్థితిని, అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అంచనా వేస్తున్నారు. జీరో కోవిడ్ పాలసీ(zero covid policy)ని చైనా ప్రభుత్వం ఉపసంహరించుకున్న తరువాత, ఆ ప్రభుత్వం హెచ్చరించిన తీరుగానే, ఆ దేశంలో కేసుల సంఖ్య అదుపు చేయలేని స్థాయిలో పెరుగుతోంది. యూకేకు చెందిన వైద్య విషయాల విశ్లేషణ సంస్థ Airfinity ప్రకారం.. ప్రస్తుతం చైనాలో కోవిడ్ (covid 19) కారణంగా రోజుకు 9 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. డిసెంబర్ 1 నుంచి చైనాలో లక్ష మంది వరకు కరోనాతో చనిపోయారు. అలాగే, డిసెంబర్ 1 నుంచి మొత్తంగా కోటి ఎనభై ఆరు లక్షల మంది కరోనా బారిన పడ్డారు.

జనవరిలో పరిస్థితి మరింత దారణం..

జనవరి నెలలో చైనాలో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అత్యధిక స్థాయికి చేరుతుందని యూకేకు చెందిన వైద్య విషయాల విశ్లేషణ సంస్థ Airfinity అంచనా వేస్తోంది. ఈ సంస్థ అంచనా ప్రకారం.. జనవరి 13న, ఒక్క రోజే చైనాలో అత్యధికంగా 37 లక్షల corona కేసులు నమోదవుతాయి. అలాగే, మరణాల విషయానికి వస్తే, జనవరి 23న, ఒక్క రోజే, కోవిడ్ 19 తో అత్యధికంగా 25 వేల మంది మరణిస్తారు. అలాగే, జనవరిలో ఆ రోజుకు చైనాలో కరోనాతో మరణించే వారి మొత్తం సంఖ్య 5.84 లక్షలకు చేరుతుంది. ఇదేదో జోష్యం అనుకుంటారేమో.. ఈ డేటాను రీసర్చ్‌ చేసి ఆ సంస్థ వెల్లడించింది.

కోవిడ్ మరణాలు, కరోనా కేసుల సంఖ్య విషయంలో చైనా వాస్తవ సమాచారాన్ని ఇవ్వడం లేదని మొదటి నుంచి ఉన్న అనుమానం..కోవిడ్ 19కు సంబంధించి సరైన డేటా ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ కూడా చైనాను కోరారు. కరోనా విజృంభణపై సరైనా సమాచారం ఇవ్వడం ద్వారా ఇతర దేశాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడానికి సులువవుతుందని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news