చంద్రబాబుకు 26 మంది చాలంట… రఫ్ఫాడించేస్తారంట!!

-

2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే! చరిత్రలో కనీవినీ ఎరుగని ఓటమి.. బాబు హయాంలో ఒంటరిగా పోటీచేయడం వల్ల టీడీపీకి దక్కింది! ఇదే సమయంలో కాలం కరోనా రూపంలో కాటు వేసింది.. బాబు భయం భాగ్యనగరంలో కట్టిపడేసింది.. చినబాబును తోడిచ్చింది! దీంతో ఇక టీడీపీని మళ్లీ బలోపేతం చేయాలని.. అందుకు తనకు 26మంది కావాలని కోరుకుంటున్నారంట చంద్రబాబు!

అవును… ప్రతీ జిల్లాలోనూ బలమైన నేతలను ఆకర్షిస్తూ, టీడీపీని నరుక్కుంటూ వస్తున్నారు జగన్! ఇందులో భాగంగా ఆయన ప్రధాన టార్గెట్.. పాలనా రాజధాని విశాఖ! ఈ ప్రాంతంలో టీడీపీకి ఏకంగా నాలుగు సీట్లు వచ్చాయి! అయితే… వాటిని టార్గెట్ చేసి ముందుగా తళ్లి వేరునుంచి నరుక్కురావాలని భావించారో ఏమో తెలియదు కానీ… ఇప్పటికే గెలిచిన ముగ్గురిని లాగేసుకున్నారు జగన్!!

ఇక గెలిచిన వారిలో మిగిలింది వెలగపూడి రామకృష్ణబాబు ఒక్కరు కాగా… ఓడిన వారిలో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మాత్రమే! అయితే… ఈ ఇద్దరూ ఎట్టిపరిస్థితుల్లోనూ గోడ దూకరనే సంకేతాలు ఇప్పటికే బాబుకు చేరాయంట. ఈ పరిస్థితుల్లో కూడా ఇంతలా పార్టీకి దన్నుగా ఉంటున్నందుకు బాబు హ్యాపీ ఫీలయ్యారంట!

అందులో భాగంగానే… ఇలా జిల్లాకు ఇద్దరు నేతల చొప్పున కనీసం 13 జిల్లాలకు కలిపి 26మంది “వెన్నుపోటు” పొడవకుండా, నమ్మకస్తులైన నెతలు కావాలని, వారు తోడుంటే పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పుకొస్తున్నారంట చంద్రబాబు! మరి బాబు కోరిక తీరుతుందా… కనీసం జిల్లాకు ఇద్దరు బలమైన, నమ్మకమైన నేతలు బాబుకు దొరుకుతారా? వేచి చూడాలి మరి!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news