వామ్మో; హైదరాబాద్ లో 44 కుటుంబాల నుంచి 268 కరోనా వైరస్ కేసులు…!

-

కరోనా వైరస్ దెబ్బ ఇప్పుడు ఊహకు కూడా అందడం లేదు. ఎటు నుంచి వస్తుందో ఏ విధంగా వస్తుందో కూడా చెప్పడం చాలా కష్ట౦. దాన్ని ఎంత తక్కువ అంచనా వేస్తే అంత నష్టమే గాని మరొకటి ఉండదు. సీరియస్ గా తీసుకున్న రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ ఇప్పుడు చుక్కలు చూపిస్తుంది. రోజు రోజుకి కరోనా వైరస్ ఇప్పుడు విలయతాండవం చేస్తుంది. తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు వెయ్యికి చేరువలో ఉన్నాయి.

తాజాగా తెలంగాణా కేసుల లెక్కల్లో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 44 కుటుంబాల నుంచి ఏకంగా 268 కేసులు నమోదు అయ్యాయి. 113 కుటుంబాల నుంచే 434 కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పరిశీలనలో గుర్తించారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో సగం హైదరాబాద్‌, సూర్యాపేట, జోగులాంబ-గద్వాల, వికారాబాద్‌ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయని అధికారులు గుర్తించారు.

హైదరాబాద్‌లోని 44 కుటుంబాల ద్వారా వ్యాప్తి చెందిన కేసులు 25 శాతం ఉన్నాయి. ఈ కుటుంబాల్లో కొందరికి ముందుగానే కరోనా లక్షణాలు కనిపించాయి. కొందరికి లక్షణాలు లేకుండా కరోనా వచ్చినట్టు తెలిసింది. వైద్య అధికారులకు సమాచారం ఇవ్వకపోవడంతో వాళ్ళు కరోనా బారిన పడ్డారని అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులే తెలంగాణాలో ఇప్పుడు తల నొప్పిగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news