తెలంగాణలోని బోధనాసుపత్రుల్లో మరో 295 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 295 పోస్టుల మంజూరుతో భర్తీ చేయనున్న మొత్తం పోస్టుల సంఖ్య 1,442కు చేరుకుంది. 22 విభాగాల్లో అదనపు పోస్టులను భర్తీ చేయనుండగా వీటిలో అత్యధికంగా గైనకాలజీ విభాగంలో 45, జనరల్ మెడిసిన్‌లో 33, జనరల్ సర్జరీలో 32, అనస్థీషియాలో 22 పోస్టులు ఉన్నాయి.
ఇప్పటికే ప్రకటించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. వారం నుంచి పదిరోజుల్లో మెరిట్ జాబితా ప్రకటిస్తారు. అభ్యంతరాల పరిశీలన తర్వాత ఎంపిక జాబితా వెల్లడిస్తారు. నెలలోపు నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి తెలిపారు.