బంగారం వ్యాపారులకి రోడ్ యాక్సిడెంట్.. 3.50 కిలోల గోల్డ్ మిస్సింగ్ ?

Join Our Community
follow manalokam on social media

నిన్న పెద్ధపల్లి జిల్లా రోడ్ ప్రమాదంలో బంగారం మిస్సింగ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. నిన్న తెల్లవారు జామున రామగుండం మండలం మల్యాల పల్లి వద్ద అదుపు తప్పి కారు బోల్తా పడింది. కారులో బంగారంతో ఏపీకి చెందిన వ్యాపారులు మంచిర్యాల వెళ్తున్నసమయంలో కారు బోల్తా పడడంతో ఇద్దరు మృతి మరో ఇద్దరికి గాయాలయినట్టు చెబుతున్నారు. నిజానికి ప్రమాదం జరిగిన కాసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు అప్పుడు కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

ఇప్పుడెమో 3 కిలోల బంగారం దొరికిందని చెప్తున్నారు పోలీసులు. అయితే ఘటన స్థలం వద్ద పెద్ద ఎత్తున బంగారం చోరీ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. వ్యాపారుల వద్ద ఉన్న బంగారం  ఎంత ? చోరీ జరిగింది ఎంత ? ఎవరు దొంగిలించారు ? అనే దాని మీద టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. ఘటన స్థలానికి వెళ్లిన అంబులెన్స్ సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే కారులో సుమారు 6.50 కిలోల పైగా బంగారం ఉందని మృతుల సంబంధికులు చెబుతున్నారు.

TOP STORIES

యూపీఐ ద్వారా చెల్లింపులు జ‌రుపుతున్నారా ? ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ ఎంతో తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం దాదాపుగా ఎవ‌రిని చూసినా డిజిట‌ల్ పేమెంట్ల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. న‌గ‌దుతో లావాదేవీల‌ను చాలా త‌క్కువ‌గా చేస్తున్నారు. కార‌ణం.. బ‌య‌ట ప్ర‌తి చోటా ఆన్‌లైన్ లో...