ఈ ఏడాది ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ బ‌హుమ‌తి

-

భౌతిక శాస్త్రంలో ఈ యేటి నోబెల్ బ‌హుమ‌తిని ప్ర‌క‌టించారు. 2023 సంవ‌త్స‌రానికి ముగ్గురికి ఆ అవార్డు ద‌క్కింది. ద రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ ఆ అవార్డును ప్ర‌క‌టించింది. పియ‌రీ అగోస్టిని, ఫెరెంక్ క్రౌజ్‌, అన్నీ హుయిల్ల‌ర్‌ల‌కు ఈ యేటి ఫిజిక్స్ నోబెల్ బ‌హుమ‌తి ద‌క్కింది. కాంతికి చెందిన ఆటోసెకండ్ ప‌ల్స్‌ల‌ను ప‌సిక‌ట్టే ప‌ద్ధ‌తుల‌ను డెవ‌ల‌ప్ చేసినందుకు ఆ ముగ్గురినీ నోబెల్ వ‌రించింది. ఎల‌క్ట్రాన్ డైన‌మిక్స్ స్ట‌డీలో ఈ ప‌ద్ధ‌తులు కీల‌కం అయిన‌ట్లు రాయ‌ల్ స్వీడిష్ క‌మిటీ వెల్ల‌డించింది.

Nobel Prize in Physics 2023: Three scientists win for research on electrons  in flashes of light - The Hindu

వీరి పరిశోధనలతో అణువులు, పరామణువుల్లోని ఎలక్ట్రాన్లను అధ్యయనం చేసేందుకు మానవాళికి కొత్త సాధనాలు అందాయని కితాబు ఇచ్చింది. ప్రైజ్ మనీని ముగ్గురి శాస్త్రవేత్తలకు సమానంగా పంపిణీ చేయనున్నారు. ఫ్రాన్స్‌లోని యాక్సి-మార్సైల్లే యూనివర్సిటీ నుంచి 1968లో పీహెచ్‌డీ పూర్తిచేసి.. పియరీ అగోస్టనీ కొలంబస్‌లోని ఓహియో స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌస్ట్.. ఆస్ట్రియాలోని వియన్నా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1991లో పీహెచ్‌డీ పూర్తిచేసి.. మ్యూనిచ్ యూనివర్సిటీ మాక్స్ ప్లాంక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.. 1958లో ఫ్రాన్స్‌లో జన్మించిన లూ హూయిలర్.. పారిస్‌లోని పియరే అండ్ మారీ క్యూరీ యూనివర్సిటీ నుంచి 1986లో పీహెచ్‌డీ చేశారు. అనంతరం స్వీడన్‌లోని లుండ్ యూనివర్సిటీ‌లో ప్రొఫెసర్‌గా ఎలక్ట్రాన్ డైనమిక్స్‌పై పరిశోధనలు కొనసాగించారు. కాగా, ఈ ఏడాది మెడిసిన్‌లో నోబెల్ బహుమతికి ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వైద్యశాస్త్రంలో న్యూక్లియోసైడ్‌ బేస్‌ మోడిఫికేషన్లలో కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌ చేసిన ఆవిష్కరణలకు అవార్డు వరించింది. వీరి ఆవిష్కరణ ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్‌ మహమ్మారి (Covid 19)ని ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు, ఈ ఏడాది నుంచి నోబెల్ ప్రైజ్ మనీని 10 లక్షల స్వీడిష్ క్రోనార్ల నుంచి 11 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ఈ బహుమతులను 120 ఏళ్ల నుంచి అందజేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news