తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా టీడీపీ అధినేత తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. అనంతరం సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు పూర్తి చేశారు. ఆ తర్వాత ఏజీ శ్రీరామ్ వాదనలకు లూథ్రా కౌంటర్ వాదనలు కూడా వినిపించారు. రాజకీయ దురుద్దేశ్యంతో సీఐడీ కేసు నమోదు చేసిందని కోర్టుకు తెలిపారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిసిన తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
ఎమ్మెల్యే ఆళ్ల ఫిర్యాదుతో 2022 మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. అయితే చంద్రబాబును ఏ-1 నిందితుడిగా పేర్కొంది. అలాగే మాజీమంత్రి నారాయణ, లింగమనేని తోపాటు పలువురుని సీఐడీ నిందితులుగా పేర్కొంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను సైతం సీఐడీ మెమోలో ఏ-14గా పేర్కొంది. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు.