ఘట్కేసర్ రేప్ అటెంప్ట్ కేసులో నలుగురు అరెస్ట్ ?

Join Our Community
follow manalokam on social media

ఘట్కేసర్ అత్యాచారయత్నం కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద ఆరుగురు ఈ ఘటనలో పాల్గొనగా నలుగురిని అరెస్ట్ చేశారు. అందులో ఆటో డ్రైవర్ రాజు అనే అతను ప్రధాన నిందితుడుగా పోలీసులు గుర్తించారు. మరో ముగ్గురు అతనికి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం మీద శివ, నందన్ భాస్కర్ అనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.  ఈ నలుగురు కూడా ఆటో డ్రైవర్ లేనని పోలీసులు చెబుతున్నారు..

ఆటోలో యువతి ఒక్కతే ఉండడంతో ఆమె మీద అత్యాచారం చేయాలని భావించిన రాజు స్నేహితులు ఐదురిని ఒక చోట ఆటో ఎక్కించుకున్నాడని అనంతరం ఆమెను ఒక చోట పొదల్లోకి తీసుకువెళ్లి ఇనుప రాడ్ తో తీవ్రంగా గాయపరిచాడు అని గుర్తించారు. అయితే ఆటోలో ఐదుగురు అనుమానాస్పద వ్యక్తులు ఎక్కడంతోనే యువతి తన తల్లిని ఫోన్ చేసి హెచ్చరించింది. వెంటనే తల్లి తన బంధువైన మరో యువకుడితో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆమె మీద అత్యాచారం జరిగే లోపు పోలీసులు ఘటనా స్థలం దగ్గరికి వెళ్లడంతో నిందితులు ఆమెను వదిలేసి పారిపోయినట్లు చెబుతున్నారు. అయితే అత్యాచారం జరిగిందా లేదా ? అనే అంశం ఇప్పటికీ తెలియలేదు.

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...