పెడన ఎమ్మెల్యేకి ఎన్నికల సంఘం షాక్ !

Join Our Community
follow manalokam on social media

కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.. ఆయన మీద ఈసీ ఆంక్షలు విధించింది. ఈ నెల 13 వరకు మీడియాతో మాట్లాడ కూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది..అలాగే జోగి రమేష్ ప్రజలతో కూడా మాట్లాడకూడదని కృష్ణా జిల్లా ఎస్పీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.నిన్న జరిగిన బహిరంగ సభలో జోగి రమేష్ మాట్లాడుతూ ప్రత్యర్ధి పార్టీల నుండి ఎన్నికలలో పోటీ చేసే వారికి తమ ప్రభుత్వం నుంచి అందే అన్ని రకాల పథకాలు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు.

.వైయస్ జగన్ ఇచ్చే మంచి మంచి పథకాలు అనుభవిస్తూ తిరిగి ఆయన మీద పోటీ చేయడానికి ఎంత ధైర్యం అంటూ ఆయన సీరియస్ గానే కామెంట్ చేశారు. ఈ అంశం మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అనడంతో ఎన్నికల సంఘం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికల సంఘం ఇచ్చిన అన్ని ఆదేశాల మీద కోర్టు కు వెళుతున్న వైసీపీ నేతలు ఈ అంశం మీద కూడా కోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...