చిరంజీవి సినిమాలో చేస్తా అంటున్న ఎన్టీఆర్…!

-

టాలీవుడ్ లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ఆయన చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడింది. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని సినీ వర్గాలు అంటున్నారు

ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడితే ఈ సినిమా కూడా వాయిదా పడి వచ్చే ఏడాది వేసవిలో కాకుండా చివర్లో సినిమాను విడుదల చేసే సూచనలు ఉన్నాయని అంటున్నారు. త్రివిక్రమ్… ఎన్టీఆర్ కంటే ముందు ఒక చిన్న బడ్జెట్ సినిమా నానీ తో చేసే అవకాశ౦ ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమా ఆలస్యం అయితే మాత్రం ఎన్టీఆర్ చిరంజీవి సినిమాలో చేసే అవకాశం ఉందని అంటున్నారు.

చిరంజీవి ఆచార్యలో ఒక కీలక పాత్ర కోసం మహేష్ బాబు, రామ్ చరణ్ పేర్లను పరిశీలిస్తున్నారు. తాను ఆ పాత్ర చేస్తాను అని ఎన్టీఆర్ ముందుకు వచ్చినట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ లో చేస్తూనే ఆచార్య సినిమాలో ఆ కీలక పాత్రలో నటించాలి అని భావిస్తున్నాడట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వస్తుందని పారితోషికం పెద్దగా డిమాండ్ చేయలేదు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news