పెరుగుతున్న టమాటా దొంగతనాలు.. 400 కిలోల టమాటా చోరీ

-

మహారాష్ట్రలోని పుణెలో ఓ రైతు పండించిన 400 కిలోల టమాటా చోరీకి గురైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… షిరూర్ తహసీల్‌లోని పింపార్‌ఖేడ్‌కు చెందిన రైతు అరుణ్ ధోమ్ కు చెందిన టమాటాను ఎత్తుకెళ్లారు. ఈ మేరకు ఆయన పుణే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను పండించిన నాలుగు వందల కిలోల టమాటాను ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tomatoes: Vehicle transporting tomatoes to market robbed in Bengaluru

శిరూర్ తాలూకా పింపర్‌ఖేడ్‌ గ్రామానికి చెందిన అరుణ్‌ బాలు ధోమే అనే రైతు రెండెకరాల పొలంలో టమాటా వేశాడు. సోమవారం జూలై 17 అతను మార్కెట్‌లో విక్రయించడానికి టమాటాలను కోసాడు. ఉదయం మార్కెట్ వద్దకు వెళ్లి టమాటా విక్రయించేందుకు 400 కిలోల టమాటాలను ఆటోలో ఉంచాడు. వస్తువులు 20ట్రేలలో ఉన్నాయి. పడుకునే ముందు మళ్లీ ఆటోలో టమాటాలు ఉన్నాయా అని చెక్ చేసుకున్నాడు. అనంతరం మంగళవారం మార్కెట్‌కు టమాటాలు తీసుకెళ్దామని లేచి చూసే సరికి ఆటోలో టమాటాలు లేవు. అతను, తన కుటుంబ సభ్యులు టమాటాల కోసం చాలా చోట్ల వెతికారు. కానీ వాటి ఆచూకీ లభించలేదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news