ఈ రోజుల్లో కంప్యూటర్ లో కట్, కాపీ, పేస్ట్ లేకుండా ఏమీ జరగవు అనేది వాస్తవం. ఏ విధంగా చూసినా సరే వాటి అవసరం ఉంటుంది. అత్యుత్తమ ప్రతిభావంతులు ఎక్కువగా వాడేది ఆ మూడింటినే. ప్రపంచం మొత్తం అలాగే ఉంటుంది. ఇక చాలా చురుకుగా ఉండే బ్యాచ్… అదేనండి బద్దకంగా తేలు మాదిరిగా, కప్ప మాదిరిగా కదిలే బ్యాచ్ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటుంది. సరే గాని ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటే…
ఆ మూడు కనిపెట్టిన మహానుభావుడు 74 ఏళ్ళ లారీ టెస్లర్ మరణించారు. ఆయన కంప్యూటర్ రంగంలో ఎన్న విప్లవాత్మక మార్పులతో ఆప్తుగా కట్, కాపీ, పేస్టు వంటి వాటిని తీసుకొచ్చి ఎందరినో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు గా తీర్చి దిద్దారు. పరోక్షంగా లెండి. న్యూయార్క్‌లో జన్మించిన ఆయన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ విద్యను అభ్యసించారు. 1973లో ఆయన జెరాక్స్ పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగంలో చేరారు.
ఇక అక్కడి నుంచి లారీ గారు, ‘కట్- కాపీ- పేస్ట్’ ని ఆవిష్కరించడం మొదలుపెట్టారు. టెస్లర్‌కు జెరాక్స్ పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్‌లో టిమ్ మాట్ అనే కంప్యూటర్ నిపుణుని సహాయంతో జిప్సీ టెక్స్ట్ ఎడిటర్ ని తయారు చేసి ఆ తర్వాత దాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ‘కట్- కాపీ- పేస్ట్’ ను తయారు చేసారు. ఇక అక్కడి నుంచి కంప్యూటర్ రంగంలో విప్లవ మార్పులు మొదలయ్యాయి.