“బూజుపట్టిన సంప్రదాయాలకు తెరదించుతూ, మగ ఆఫీసర్స్ ఆడవారి ఆర్డర్లను తీసుకోరు అన్న ప్రభుత్వం వాదనను పక్కనపెట్టి, కొత్త శకానికి నాంది పలికిన సుప్రీమ్‌కోర్ట్. ఆనాడు, అన్న NTR గారు, ఆడవారికి సమాన ఆస్తిహక్కులు కల్పించి మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియజేశారు. అదే స్ఫూర్తితో మన తెలుగువారు కూడా, మన ఆడపడుచులను గౌరవిస్తూ, తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను.
అవకాశాల్లో సగం, ఆస్తిలో సగం, ప్రజా ప్రతినిధుల్లో సగం, ప్రభుత్వంలో సగం.” విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధిగా పోటీ చేసిన పోట్లురి వీర ప్రసాద్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి గత కొన్ని రోజులుగా జగన్ ని సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని, జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందీ అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. జగన్ ఢిల్లీ వెళ్ళినా మోడిని గాని అమిత్ షా ని గాని కలవకపోవడం వంటివి ఎన్నో అనుమానాలకు వేదికగా మారాయి.
జగన్ ని ఏమైనా లోపల వేస్తారా అంటూ టీడీపీ, భారతి ముఖ్యమంత్రి అవుతున్నారని జనసేన చేస్తున్న ప్రచారానికి ఎంపీ అభ్యర్దిగారు మరింత బూస్ట్ ఇచ్చారు. అసలు ఇప్పుడు ఆయన గారు అలా ఎందుకు పెట్టారో తెలియదు గాని ఏదో జరుగుతుంది అని మాత్రం కొందరు పక్కాగా అంటున్నారు. రాజకీయంగా జగన్ బలంగానే ఉన్నారు. కేంద్రం కూడా ఆయన విషయంలో బాగానే ఉంది. రాజధాని కి కూడా ఒప్పుందని వైసీపీ చెప్తుంది. మరి ఇలాంటి తరుణంలో భారతమ్మ ముఖ్యమంత్రి ఎందుకు అవుతారు అనేది అర్ధం కాని విషయ౦.