4374 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ అవుట్.. అర్హత మొదలైన వివరాలు ఇవే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ముంబై ట్రాంబే లోని భారత అణు శక్తి విభాగానికి చెందిన భాభా అణు పరిశోధనా కేంద్రం (BARC) లో కొన్ని ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ ని ఈ మేరకు విడుదల చేసింది. పూర్తి వివరాలు చూస్తే.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/ ట్రైనింగ్ స్కీం ద్వారా డీఏఈ విభాగాల్లో 4374 పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్ లైన్ లో అప్లై చెయ్యచ్చు. ఏప్రిల్‌ 24 అనగా నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు అవుతుంది. మే 22 దరఖాస్తులకు చివరి తేది.

ఖాళీల వివరాలు చూస్తే.. మొత్తం ఖాళీలు: 4374. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ – 212, టెక్నికల్ ఆఫీసర్/ సి: 181, సైంటిఫిక్ అసిస్టెంట్/ బి: 7, టెక్నీషియన్/ బి: 24. దరఖాస్తు ఫీజు టీవోకు రూ.500, ఎస్‌ఏకు రూ.150, టెక్నీషియన్‌కు రూ.100, కేటగిరీ-1కు రూ.150, కేటగిరీ-2కు రూ.100 గా ఉంది. ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు మినహాయింపు ఉంది. హైదరాబాద్‌, కరీంనగర్‌, అమరావతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం తెలుగు రాష్ట్రాల లో పరీక్షలు అవుతాయి. నెలకు టీవో ఖాళీలకు రూ.56,100; ఎస్‌ఏకు రూ.35,400; టెక్నీషియన్ పోస్టులకు రూ.21,700 ఇస్తారు.

ఇది ఇలా ఉంటే ఖాళీలు కేటగిరీ-1: 1216, కేటగిరీ-2: 2946 వున్నాయి. నెలకు కేటగిరీ-1కు రూ.24,000 నుంచి రూ.26,000; కేటగిరీ-2కు రూ.20,000 నుంచి రూ.22,000 వరకు స్టైఫండ్ ఇస్తారు. పోస్టులను బట్టి 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ లేదా ఎంఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ పూర్తి చేసి ఉండాలి. ఇక వయస్సు గురించి చూస్తే.. టెక్నికల్ ఆఫీసర్‌కు 18-35; సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 18-30; టెక్నీషియన్‌కు 18-25; స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-1కు 19-24; స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-2కు 18-22 ఉండాలి. ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. పూర్తి వివరాలని https://www.barc.gov.in/ లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news