మీ భార్య పేరు మీద ఈ ఖాతా తెరిస్తే.. నెలకి రూ.45 వేలు పెన్షన్…!

-

ఈ మధ్య కాలంలో ప్రతీ ఒక్కరు కూడా భవిష్యత్తు లో ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని చూస్తున్నారు. మీరు లేకపోయినా వున్నా కూడా ఎవరిపైనా ఆధారపడకుండా సొంతంగా డబ్బును పొందాలని కోరుకుంటే నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో డబ్బులు పెట్టచ్చు. మీరు మీ భార్య పేరు మీద కూడా ఈ స్కీమ్ ని తెరవచ్చు.

NPS ఖాతా మీ భార్యకు 60 ఏళ్లు నిండిన తర్వాత ఒకేసారి డబ్బులు వస్తాయి. దీనితో పాటుగా ప్రతి నెలా పెన్షన్ రూపం లో ఆదాయాన్ని పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. NPS ఖాతాతో మీరు మీ భార్యకు ప్రతీ నెలా కూడా డబ్బులు పెన్షన్ కింద వస్తాయి.

మీ భార్య 60 ఏళ్ల తర్వాత డబ్బు కోసం ఎవరి పైనా ఆధార పడకూడదు. రూ.1,000తో మీ భార్య పేరు మీద ఎన్‌పీఎస్‌ ఖాతాను తెరవచ్చు. NPS ఖాతా లో ప్రతి నెలా డబ్బును జమ చెయ్యచ్చు. ఇందులో మీరు కేవలం రూ.1,000తో మీ భార్య పేరు మీద అకౌంట్ ని ఓపెన్ చేసేయచ్చు. 60 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. మీ భార్యకు 30 ఏళ్లు ఉంటే NPS ఖాతా లో ప్రతి నెలా రూ. 5000 పెట్టుబడి పెడితే ఏటా 10 శాతం రాబడి వస్తే 60 ఏళ్ల వయసులో రూ.1.12 కోట్ల వరకు జమ అవుతాయి. దాదాపు 45 లక్షల రూపాయలు వస్తాయి. అలానే ప్రతీ నెలా దాదాపు రూ.45,000 వరకు పెన్షన్ మీకు వస్తుంది. ఇలా జీవితాంతం పెన్షన్ మీకు వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news