కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు దేశం భయపడుతుంది. వైద్య చికిత్స విషయంలో కేసులు పెరిగితే ఏ విధంగా వ్యవహరించాలి అనేది రాష్ట్రాలకు అర్ధం కావడం లేదు. ఇక కరోనా వ్యాక్సిన్ వస్తుంది అనే ఆశలు కూడా దాదాపుగా ఎవరిలో కూడా లేవు అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా చికిత్సలో యాంటీ బాడీస్ చాలా కీలకం కావడంతో ప్లాస్మా వైద్యం అనేది దేశ వ్యాప్తంగా పెరుగుతుంది.
అందుకే దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణా, ముంబై, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు ప్లాస్మా బ్యాంకు లను ఓపెన్ చేస్తున్నాయి. తాజాగా కర్ణాటక కీలక ప్రకటన చేసింది. ప్లాస్మా దాతలను ప్రోత్సహించడానికి గానూ… ప్లాస్మా దానం చేసిన వారికి 5 వేల రూపాయల బహుమతి ఇస్తామని చెప్పింది ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ ఈ ప్రకటన చేసారు.