‘శకుంతల దేవి’ గా ఒదిగిపోయిన విద్యాబాలన్…!

-

విద్యాబాలన్… భారతదేశ నటీమణులలో చెప్పుకోతగ్గ హీరోయిన్ ఈవిడ. పాత్రకు తగ్గట్టు హావభావాలు పలికించడం ఆమెకు సొంతం. ఓవైపు గ్లామర్ రోల్స్ లో యువతను అలరిస్తూనే, మరోవైపు సీరియస్ పాత్రలో తన నటనా ప్రావీణ్యాన్ని చూపించగల వ్యక్తి ఆవిడ. గత సంవత్సరం విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో ఎన్టీఆర్ సతీమణి గా బసవతారకం పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే తాజాగా విద్యాబాలన్ మరో బయోపిక్ లో నటించనున్నారు.

SANKUNTHALADEVI
SANKUNTHALADEVI

హ్యూమన్ కంప్యూటర్ గా పేరుపొందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త శకుంతలాదేవి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ” శకుంతలాదేవి – హ్యూమన్ కంప్యూటర్ ” సినిమాలో శకుంతలా దేవి గా నటిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. ఈ సందర్భంగా ఆ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా, అందులో శకుంతలాదేవి పాత్రలో విద్యాబాలన్ ఒదిగి పోయింది. ఈ చిత్రంలో విద్యాబాలన్ మొత్తం ఐదు రకాల షేడ్స్ లో కనిపించబోతున్నాడు. జూలై 31వ తారీకున అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news