అదిరే స్కీమ్.. రూ. 50 లక్షల వరకూ లోన్..!

-

చాలామంది వ్యాపారాలని చేయాలని చూస్తూ ఉంటారు. వ్యాపారాలని చేయాలంటే లోన్ తీసుకుంటే ఈజీగా బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవడానికి అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను తీసుకువచ్చింది లోన్ ఇచ్చేందుకు కూడా పలు స్కీమ్స్ ని తీసుకు వచ్చింది చిన్న కంపెనీ మొదలు పెట్టాలని చూస్తున్నట్లయితే కచ్చితంగా మీరు ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాలి. మీ కల సహకారం అయ్యే ప్లాన్ ఇక్కడ ఉంది. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చాలా మంది విసిగిపోతున్నారు అలా కాకుండా సొంతంగా బిజినెస్ ని మొదలు పెట్టాలనుకుంటే ఈ స్కీమ్ ద్వారా సాధ్యమవుతుంది.

మీ కలని సాకారం చేసుకోవచ్చు ఎకానమీ 2024 కి అయిదు ట్రిలియన్ డాలర్లకి పెరగాలి అన్నది లక్ష్యం. అయితే దానిని చేరుకోవాలంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయి చిన్న మధ్య తరహా వ్యాపారాలు ఎంత ఎక్కువ ఏర్పడితే దేశ ఎకానమీ అంత పెరుగుతుంది దీనికోసం అవసరమయ్యే నిధులని సబ్సిడీతో పాటుగా లోన్ రూపంలో అందిస్తుంది కేంద్రం. ఈ స్కీమ్ ఏంటి ఈ స్కీం వివరాలు గురించి కూడా చూసేద్దాం.

ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద ఔత్సాహిక పారిశ్రామిక వేతనాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది క్రెడిట్ లింక్ సబ్సిడీ పథకం ద్వారా చేయూతని అందిస్తోంది. కుటీర చిన్న మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రస్థాయిలో కేవీఐసీ, కేవీఐబీ, జిల్లా పరిశ్రమల సెంటర్ దీనిని నిర్వహిస్తోంది. పీఎం ఈజీపి కింద లోన్ ఇస్తోంది. 25 లక్షల నుంచి 50 లక్షలు వరకు దీనిని ఈ మధ్య పెంచారు సర్వీస్ రంగంలో లోన్ తీసుకోవాలంటే దాని లిమిట్ పది లక్షల నుండి 25 లక్షలు చేసారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన జనరల్ క్యాటగిరీకి 25% సబ్సిడీ ఉంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీస్ దివ్యాంగులకు 35% సబ్సిడీ ఉంది. దరఖాస్తులు కోసం కెవిఐసి అధికారిక వెబ్సైట్ ని సంప్రదించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news